![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్ తప్ప అందరు డేంజర్ జోన్ లో ఉన్నారు. అందరూ టీమ్ లుగా విడిపోయి గేమ్ ఆడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అయిదు టీమ్ లలో ఒక్కొక్కరు డాన్స్ చెయ్యాలి.. పాట ఆపినప్పుడు బిగ్ బాస్ చెప్పిన కలర్ గల హోల్స్ నుండి కంటెస్టెంట్స్ వెళ్ళాలి.
అలా ఎవరు ముందు వెళ్తారో వాళ్లే ఆ రౌండ్ విన్నర్.. మొదటి రౌండ్ కి కళ్యాణ్, తనూజ టీమ్, రెండో రౌండ్ కి భరణి దివ్య టీమ్.. మూడో రౌండ్ కి డీమాన్ పవన్, రీతూ.. నాలుగో రౌండ్ కి సుమన్ శ్రీజ, చివరగా సంజన ఫ్లోరా ఉన్నారు. పాయింట్స్ బోర్డు పై సంజన ఫ్లోరా నాలుగో స్థానంలో, సుమన్ శ్రీజ అయిదో స్థానంలో ఉన్నారు. అయితే మొదటి స్థానంలో ఉన్న భరణి, దివ్యకి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చాడు. చివరి రెండు స్థానాలలో ఉన్న ఒక టీమ్ ని తీసేయమని భరణి, దివ్య టీమ్ కి బిగ్ బాస్ చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ కలిసి డిస్కషన్ చేసుకొని సంజన, ఫ్లోరాలని టాస్క్ నుండి ఎలిమినేట్ చేస్తారు. దాంతో సంజన ఏడుస్తుంది. నన్ను ఇంటికి పంపించండి బిగ్ బాస్ అంటూ ఏడుస్తుంది.
ఆ తర్వాత పిరమిడ్ టాస్క్ లో తనూజ, కళ్యాణ్ మొదటగా పూర్తి చేశారు. దివ్య, భరణి రెండవ స్థానంలో టాస్క్ ని పూర్తి చేశారు, సుమన్ శెట్టి, శ్రీజ మూడవ స్థానం, రీతూ, డిమాన్ నాల్గవ స్థానంలో పూర్తి చేశారు. పాయింట్స్ బోర్డు లో మొదటి స్థానంలో భరణి, దివ్య ఉన్నారు. కాగా వాళ్ళని సేఫ్ జోన్ కి బిగ్ బాస్ పంపిస్తాడు. ఇక రెండో స్థానంలో ఉన్న కళ్యాణ్, తనూజ ఇద్దరిలో ఒకరికి మాత్రమే సేఫ్ జోన్ ఛాన్స్ వస్తుందని బిగ్ బాస్ చెప్పగా ఇద్దరు డిస్కషన్ చేసుకొని కళ్యాణ్ ని సేఫ్ జోన్ అని తనూజ చెప్తుంది. ఇక డేంజర్ జోన్ లో తనూజ ఉంటుంది.
![]() |
![]() |